జాతీయం ముఖ్యాంశాలు

కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. జిల్లాలోని హసన్‌పురా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే 9 రోజుల్లో మొత్తం 7 ఎన్‌కౌంటర్‌లు జరగ్గా, అందులో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఉగ్రవాదులు ఇద్దరూ స్థానికులేనని, లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’తో సంబంధం ఉన్నారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. అంతే కాదు పలు ఉగ్రవాద నేరాల్లో కూడా ప్రమేయం ఉంది. ఇద్దరు ఉగ్రవాదులు షోపియాన్‌లోని అలమ్‌గంజ్‌కు చెందిన అమీర్ అహ్మద్ వానీ, పుల్వామాలోని టికెన్‌కు చెందిన సమీర్ అహ్మద్ ఖాన్‌గా జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారు.