తెలంగాణ

కేసీఆర్ వ‌రంగల్ జిల్లా ప‌ర్య‌ట‌న ర‌ద్దు

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రుల బృందం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాల్టి వ‌రంగల్ జిల్లా ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయింది.రాష్ట్రంలో ఇటీవ‌ల వ‌డగండ్ల‌ వ‌ర్షం తో రైతులు తీవ్రంగా న‌ష్ట పోయారు. ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లాలో రైతుల తీవ్రంగా న‌ష్ట పోయారు. దీంతో సీఎం కేసీఆర్ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్యటించాల‌ని నిర్ణయించారు. పంట న‌ష్ట పోయిన రైతుల‌ను నేరుగా క‌లిసి మాట్లాడాల‌ని అనుకున్నారు. అనివార్య కార‌ణాల వ‌ల్ల సీఎం వ‌రంగల్ జిల్లా ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయింద‌ని సీఎంవో అధికారిక వ‌ర్గాలు తెలిపాయి. కాగా, ఇవాళ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మంత్రుల బృందం ప‌ర్య‌టించ‌నుంది. .