టీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. తెలంగాణ సర్కారు పాలన అంతా శాండ్, ల్యాండ్, వైన్స్, మైన్స్ చుట్టూ కేంద్రీకృతమైందని విమర్శించారు. దోచుకో దాచుకో అన్నట్టుగా టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశం అభివృద్ధి పథంలోకి వచ్చిందని ఉత్తమ్ స్పష్టం చేశారు. బీజేపీ తరహాలో విభజించి పాలించడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు. సూర్యాపేట అసెంబ్లీ స్థానం డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.