అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోండి… తక్షణమే రాజీనామా చేస్తా: రఘురామ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పార్లమెంటులో అనర్హత వేటు వేయించాలని వైస్సార్సీపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుండడం తెలిసిందే. దీనిపై రఘురామ స్పందించారు. నాపై అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోండి… ఇప్పటికిప్పుడు పదవికి రాజీనామా చేస్తాను అంటూ సవాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నానని డెడ్ లైన్ విధించారు.
తాను ఢిల్లీలో ఉంటే పారిపోయానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. గత రెండున్నర సంవత్సరాలుగా జగన్ కోర్టుకే రావడం లేదని, దీనిపై ఏమంటారని ప్రశ్నించారు. కాగా, బీజేపీ ఎంపీ బండి సంజయ్ విషయంలో ఒకలా వ్యవహరిస్తున్న ప్రివిలేజ్ కమిటీ, తన విషయంలో మరోలా వ్యవహరిస్తోందని ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు.