ట్విట్టర్ ద్వారా చిరంజీవి వెల్లడి
మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చిరంజీవి వెల్లడించారు. తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటీకీ కరోనా సోకిందని చెప్పారు. తనకు తేలికపాటి లక్షణాలు ఉండడంతో నిన్న రాత్రి కరోనా పరీక్ష చేయించుకున్నానని దీంతో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన అన్నారు.
ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. త్వరలోనే కోలుకుని మళ్లీ అందరినీ కలుస్తానని చెప్పారు. కాగా, టాలీవుడ్‌లో ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.