తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఢిల్లీ తెలంగాణ భవన్ లో మౌన దీక్ష చేపట్టారు. ముందుగా ఢిల్లీ తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బండి సంజయ్ తెలంగాణ భవన్ లోనే ఒక గంట పాటు దీక్ష కు కూర్చున్నారు. నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన దీక్ష చేపట్టారు. అలాగే తెలంగాణ బీజేపీ ఆఫీసులో బీజేపీ నేతలు లక్ష్మణ్, రాజాసింగ్ లు, మండల కేంద్రాల్లో బీజేపీ నేతలు దీక్షలకు కూర్చున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. భారత రాజ్యంగంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంపై దశలవారీగా ఉద్యమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సైతం సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ రోజు ఢిల్లీలో మౌన దీక్ష చేపట్టారు. బీజేపీ భీమ్ దీక్ష పేరుతో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు.