జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 1,27,952 క‌రోనా కేసులు

యాక్టివ్ కేసులు 13,31,648

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న‌ దేశంలో 1,27,952 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 2,30,814 మంది కోలుకున్నార‌ని వివరించింది.

క‌రోనా కార‌ణంగా నిన్న 1,059 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 13,31,648 మంది చికిత్స తీసుకుంటున్నారు. మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,01,114కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతం పెరిగింది. వినియోగించిన‌ క‌రోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 1,68,98,17,199కు చేరింది.