రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు
కొంతకాలంగా కేంద్రంపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి తదితరులు, సీఐ వరప్రసాద్ కు ఫిర్యాదుతో పాటు రాజ్యాంగం ప్రతిని కూడా అందజేశారు. తమ ఫిర్యాదు ఆధారంగా సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు.