తెలంగాణ

పీఎం వెంటనే తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి : మ‌ల్లారెడ్డి

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ సరియైన పద్ధతిలో జరగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన పట్ల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం మేడ్చ‌ల్ జిల్లా తూముకుంట‌లో మంత్రి మ‌ల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో నల్ల జెండాలు పట్టుకుని నిరసన చెప్పారు. అనంత‌రం పీఎం దిష్టిబొమ్మ దహ‌నం చేశారు. రాజ్యాంగ బద్దంగా విభజన జరగనందున రెండు రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తున్నాయనీ పీఎం ఆరోపించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. అన్ని కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. పీఎం వెంటనే తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.