తెలంగాణ రాజకీయం

మున్సిపల్ సమావేశం నిధుల కేటాయింపు పై నిర్ణయం

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ వాణి నిధుల నుంచి అభివృద్ధి పనులు చేయడానికి, సిసి రోడ్డు వేయడానికి రూ. 50 లక్షలు కేటాయించారు. మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పండు నుంచి అభివృద్ధి పనులకు రూ. 45 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 1-18 వార్డులలో మంచినీటి సరఫరా, మోటార్ల రిపేరు కోసం, మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ. పది లక్షలు కేటాయించినట్లు తీర్మానించారు. వివిధ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, డిఈఈ చిరంజీవిలు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.