కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లు
తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్టు చెప్పారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. ఈ నెల 16న ఉదయాస్తమ సేవా టికెట్లను విడుదల చేస్తామని చెప్పారు. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన వారికి ఈ టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా విరాళమిచ్చిన భక్తులకు ఉదయాస్తమయ సేవా టికెట్లను జారీ చేస్తామని… ఈ టికెట్ల బుకింగ్ కు ప్రత్యేక పోర్టల్ జారీ చేస్తామని చెప్పారు.