ఈటల, రాజా సింగ్‌ను హౌస్ అరెస్ట్
తెలంగాణలోని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న జనగామలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి ఈటల వెళ్తుండగా అందుకు అనుమతి లేదంటూ ఆయనను అడ్డుకున్నారు. దీంతో ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని ఈటల అన్నారు. శాంతియుతంగా నిరసనలు, బంద్‌లు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకీ మాత్రమే అనుమతిస్తారా? అని మండిపడ్డారు.
మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసులపై రాజా సింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు నిరసనగా జనగామలో ఈ రోజు బీజేపీ మౌనదీక్షకు పిలుపునిచ్చింది. అందులో పాల్గొనడంతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు బీజేపీ నేతలు ప్రణాళికలు వేసుకున్నారు.