రానుపోను ఒక్కొక్కరికి రూ. 19,999
జాతరను ఏరియల్ వ్యూ ద్వారా చూడాలనుకుంటే రూ. 37 వేలు
మేడారం జాతర కు వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆదివారం (ఫిబ్రవరి13) నుంచి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. హనుమకొండ నుంచి భక్తులను మేడారం చేర్చేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ సేవలను అందించనుంది.
హనుమకొండ నుంచి మేడారంకు వెళ్లి, మళ్లీ అక్కడ నుంచి హనుమకొండకు రావడానికి ఒక్కొక్కరికి టికెట్ ధరను రూ. 19,999గా నిర్ణయించారు. దీనికి తోడు 8 నుంచి 10 నిమిషాల జాతర విహంగ వీక్షణం కోసం రూ. 37 వేల టికెట్ ఫిక్స్ చేశారు. ఒక్కో ట్రిప్పులో ఆరుగురు ప్రయాణించే అవకాశం ఉంటుంది. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. టికెట్లను బుక్ చేసుకోవడానికి హెలీట్యాక్సీ వెబ్ సైట్లోకి వెళ్లాలి లేదా 9400399999, 9880505905 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.