ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

జగన్ తో చాలా విషయాల గురించి మాట్లాడాను: మంచు విష్ణు

తిరుపతిలో సినిమా స్టూడియో పెడతా.. మంచు విష్ణు

సీఎం జగన్ తో మంచు విష్ణు భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలను వెల్లడించారు. సీఎంతో తాను చాలా విషయాల గురించి మాట్లాడానని చెప్పారు. జగన్ తో మాట్లాడిన విషయాలు వ్యక్తిగతమైనవని అన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై కూడా చర్చించామని చెప్పారు. తిరుపతిలో తాను సినిమా స్టూడియో పెడతానని తెలిపారు.

ముఖ్యమంత్రితో చర్చలకు నాన్న గారికి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని… అయితే, ఆ ఆహ్వానం నాన్నకు చేరకుండా కొందరు అడ్డుకున్నారని చెప్పారు. వాళ్లు ఎవరో తమకు తెలుసని, సమయం వచ్చినప్పుడు చెపుతామని అన్నారు. నాన్న గారిని పిలవలేదనేది దుష్ప్రచారమని చెప్పారు. విశాఖకు సినీ పరిశ్రమను ఎలా తరలించాలనే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమకు ఏపీ, తెలంగాణలు రెండు కళ్లు అని చెప్పారు. సినీ పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబమని అన్నారు.