తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, జాబ్ నోటిఫికేషన్ గురించి వైయస్సార్టీపీ అధ్యక్షురాలు తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు హైదరాబాదులోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట ఆమె ధర్నాకు దిగారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగభృతిని అమలు చేయాలంటూ టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. అనంతరం ధర్నాకు దిగారు. ఉద్యోగాలు ఇవ్వని ఈ సీఎం మనకు వద్దని నినాదాలు చేశారు. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె ధర్నాకు దిగారు.