జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు వెళ్తున్నారు. నరసాపురం రుస్తుం బాద్‌లో రేపు సాయంత్రం ‘మత్స్యకార అభ్యున్నతి సభ’ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగించనున్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా వృత్తిపరమైన ఉపాధి భరోసా, మత్స్యకారుల డిమాండ్ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయాయి.ప్రభుత్వంలోని పెద్దలకు వీటిపై దృష్టి పెట్టే సమయం, ఆలోచన రెండూ లేవంటూ ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మత్స్యకారుల కోసం జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రేపు ఈ సభ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నరసాపురానికి చేరుకుంటారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా ఉన్న 217 జీవోపై గళమెత్తడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లుగా పార్టీ తెలిపింది.
Related Articles
Road accident : మూడు రోజుల్లో పెళ్లి అంతలోనే విషాదం..
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email అనంతపురం మండలం కదిరి మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాలివి.. కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామానికి మహేశ్ (26)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ 27న వివాహం జరగాల్సి […]
శారదా పీఠం..అక్రమాల పుట్ట
శారదాపీఠం.. పేరుకే పీఠం కానీ వివాదాల పుట్ట అనే వి…
భారత రాష్ట్రపతికి, ప్రధానికి, ప్రజలకు కృతజ్ఞతలు: సత్య నాదెళ్ల
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email పద్మభూషణ్ అవార్డు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. భారత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ”మీ అందరితో కలిసి పనిచేసేందుకు, భారతీయులు మరిన్ని […]