ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అభియోగం
ప్రముఖ నటుడు సోనూసూద్ పై పోలీసు కేసు నమోదైంది. తాజాగా పంజాబ్‌లో జరిగిన పోలింగ్ లో ఎన్నికల నియమావళిని ఆయన ఉల్లంఘించారని ఆయనపై అభియోగాలు మోపారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు నటుడు సోనూసూద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ పోటీ చేశారు. కాగా , పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా అధికారులు ఆదివారం ఆయన్ని అడ్డుకుని, ఆయనకు చెందిన కారులను సీజ్ చేసిన విషయం తెలిసిందే.