దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతుంది. సామాన్య ప్రజలనే కాదు అన్ని రంగాలవారికి కరోనా సోకుతుంది. తాజాగా పార్లమెంట్లో 350 మంది సిబ్బందికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా జరుగుతున్న కరోనా పరీక్షల్లో.. 350 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వాళ్ల కాంటాక్ట్ లకు కూడా పరీక్షలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. అయితే గత నెలలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల కారణంగానే కేసులు పెరిగినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
మరోపక్క ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. బాంద్రా- కుర్లా కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో మొత్తం 235 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 68 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్ బారిన పడినవారు హోం క్వారంటైన్లో ఉంటారని అధికారులు వెల్లడించారు. ఇక దేశంలో ఓమిక్రాన్ కేసులు సంఖ్య 3వేలను దాటాయి. అయితే ప్రస్తుతం వచ్చే కేసుల్లో దాదాపుగా సగాని కన్నా పైగా.. ఓమిక్రాన్ కేసులే ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.