వెంటనే పరిష్కరించాలని ‘జలమండలికి’ భాజపా కార్పొరేటర్ల వినతి
‘గ్రేటర్’ పరిధిలో మంచి నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిశేఖరించాలని జలమండలి అధికారులకు భాజపా కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళ వారం ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఏ సందర్భంగా నేతలు మాట్లాడారు. ప్రభుత్వానికి బార్ల మీద ఉన్న ప్రేమ ప్రజలపై లేదని విమర్శించారు. ఎవరిని సంప్రదించి వాటర్ వర్క్స్ ను జీహెచ్ఎంసీ లో విలీనం చేశారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ కు సమన్వయ లోపం కారణంగా, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మంచి నీటిలో డ్రైనేజీ నీరు కలుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు. అధికారులు తక్షణమే నీటి సమస్య, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.