తెలంగాణ

రోశయ్య మృతి పట్ల చిరంజీవి సంతాపం

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేసారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడం తో రోశయ్య కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న మార్గమధ్యంలోనే రోశయ్య మరణించాడు. రోశయ్య పార్ధీవదేహాన్ని కొద్దీ సేపటి క్రితం కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొని వచ్చారు. రేపు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. ఈ క్రమంలో రోశయ్య మృతి పట్ల సినీ , రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియపరుస్తున్నారు.

చిరంజీవి స్పందిస్తూ..ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత అని కొనియాడారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఓ రుషి మాదిరిగా సేవ చేశారని … రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించారని చెప్పారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య అంటూ చిరంజీవి కీర్తించారు.

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో రోశయ్యను చిరంజీవి పలుమార్లు కలిశారు. అసంఘటిక కార్మిక సమస్యలు పరిష్కరించాలని అప్పట్లో సీఎం రోశయ్యను చిరంజీవి కోరడం జరిగింది.