ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది. కృష్ణ జిల్లా గుడివాడలో జీ3 భాస్కర్ థియేటర్‌ను ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా ఈ సంఘటన ఎదురైంది. మొదటి సినిమాగా భీమ్లా నాయక్‌ను ప్రదర్శిస్తుండడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు అక్కడికి చేరుకుని మంత్రి పేర్నినానికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.
దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ సినిమాల పట్ల ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని జనసేన నాయకులు ఆరోపించారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఎస్‌ఎల్‌ఎన్ థియేటర్‌లో పవన్ అభిమానులు విధ్వంసానికి పాల్పడ్డారు. సినిమా ప్రదర్శన సమయంలో కరెంట్ నిలిచిపోవడంతో రెచ్చిపోయిన అభిమానులు థియేటర్ ద్వారం, కిటికిలు ధ్వంసం చేశారు.