అంతర్జాతీయం ముఖ్యాంశాలు

ఉక్రెయిన్‌కు మద్దతుగా ‘నాటో’ దేశాలు రంగంలోకి

యుద్ధ సామాగ్రితో పోలాండ్ కు చేరుకున్న బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్

రష్యా , ఉక్రెయిన్ ల మధ్య యుద్ధంలో కీలక మలుపు చోటుచేసుకుంది. రణరంగం లోకి ‘నాటో ‘ వచ్చింది. ఉక్రెయిన్‌కు మద్ధతుగా ‘నాటో’ దేశాలు రంగంలోకి దిగాయి. రష్యా నుంచి తమను కాపాడాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సాయం కోరటంతో ‘నాటో’ స్పందించింది. యుద్ధంలోకి నాటో దేశాలు ఎంట్రీ ఇచ్చాయి. 40 వేల ‘నాటో’ సైనికులు రొమేనియాకు చేరుకున్నారు. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలు, 4 ఫైటర్ జెట్‌లు, బ్రిటన్ నుంచి అత్యాధునిక యుద్ధ సామాగ్రితో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ పోలాండ్ కు చేరుకుంది .