మానవ హక్కుల మండలి నుంచి రష్యా తొలగింపునకు తీర్మానం
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా చైనా ఓటు వేసిందంటూ అగ్రరాజ్యం అమెరికా మండిపడుతోంది. రష్యాకు మద్దతు కొనసాగిస్తే చైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
రష్యాకు భౌతిక మద్దతు కొనసాగిస్తే, రష్యాపై విధించిన కఠిన ఆంక్షల్లో కొన్నింటిని చైనాకు కూడా రుచి చూపిస్తామని స్పష్టం చేసింది. రష్యా వాణిజ్యం, ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించామో చైనా ఇప్పటికే చూసిందని, పద్ధతి మార్చుకోకపోతే రష్యాకు పట్టిన గతే చైనాకు కూడా పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ సహాయమంత్రి వెండీ షెర్మన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులను అడ్డుకోవడానికి చైనా ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదని, పుతిన్ వైఖరిని ఖండించడంలోనూ చైనా విఫలం చెందిందని పేర్కొన్నారు.