భారత్ , చైనాలు ఒకరి శక్తిని మరొకరు హరించుకోకూడదు: చైనా విదేశాంగ మంత్రి
చైనా భారత్ సంబంధాల విషయంలో చైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. లక్ష్యాలను చేరుకునే దిశగా ఇండియా, చైనాలు ఒకరికొకరు సహకరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ అన్నారు. అనవసరంగా ఒకరి శక్తిని మరొకరు హరించుకునే పని చేయకూడదని వ్యాఖ్యానించారు. భారత్ తో చైనాకు ఉన్న సంబంధాలు కొంత దెబ్బతిన్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించాయని అన్నారు. 2020 జూన్ లో భారత్, చైనాల మధ్య గాల్వాన్ ప్రాంతంలో ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో చైనా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.