కఠిన ఆంక్షలను విధిస్తున్న చైనా
చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు దాదాపు ఏడాది కాలం తర్వాత చైనాలో కరోనా మరణాలు కూడా సంభవించాయి. జిలిన్ ప్రావిన్స్ లో ఇద్దరు వ్యక్తులు కరోనా కారణంగా మృతి చెందారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇక చైనాలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో స్థానిక సింప్టొమేటిక్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.
గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతుండటంతో చైనా అప్రమత్తమవుతోంది. కఠిన ఆంక్షలను విధిస్తోంది. ఇటీవల కనీసం 10 నగరాల్లో లాక్ డౌన్ విధించింది. వీటిలో టెక్ హబ్ గా పేరుగాంచిన షెంజెన్ కూడా ఉంది. తాజా పరిణామాలను ప్రపంచ ఆరోగ్య నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని కొందరు చెపుతున్నారు. జూన్, జులై మాసాల్లో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని మరికొందరు హెచ్చరిస్తున్నారు.