వూజో సిటీ సమీపంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలిన వైనం
చైనాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 133 మంది దుర్మరణం చెందారు. చైనాలోని గ్వాంగ్ జీ జీయాంగ్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బోయింగ్-737 విమానం గ్వాంగ్జీ ప్రావిన్స్ గగనతలంలో ప్రయాణిస్తుండగా వూజో నగరం సమీపంలోని గ్రామీణ ప్రాంతాలో కూలిపోయింది. ఈ విమానంలో 133 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. విమానం ఓ కొండపై కూలిపోగా, అక్కడ అగ్నిప్రమాదం సంభవించినట్టు సమాచారం. ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటీన సహాయక బృందాలను తరలించారు.