కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా అరెస్టుకు డిమాండ్
లఖింపూర్ కేసులో అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సోమవారం రైల్‌రోకోకు పిలుపునిచ్చింది. సోమవారం దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో నిర్వహిస్తామని ఆదివారం ప్రకటనలో తెలిపింది. రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపాలని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయవద్దని కోరింది. ఈ నెల 3న లఖింపూర్‌లో కారు రైతులపైకి దూసుకెళ్లడం, అనంతరం హింసలో 8 మంది చనిపోయారు. ఈ కేసులో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు 9న అరెస్టు చేశారు. అజయ్ మిశ్రాను కూడా అరెస్టు చేయాలని ఎస్‌కేఎం డిమాండ్ చేస్తున్నది.