దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,427
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 6.6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,938 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,531 మంది కరోనా నుంచి కోలుకోగా… 67 మంది మృతి చెందారు.
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 22,427 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,24,75,588 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 182 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ వేయగా… నిన్న ఒక్కరోజే 31.8 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే.