మహారాష్ట్ర శంబాజీపూర్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 500 నోటుపై రాముడి ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేసారు. ఇప్పటికే అమెరికా, థాయ్ లాండ్, యూరప్, 80శాతం ముస్లిం లు ఉన్న ఇండోనేషియా దేశాలలో కరెన్సీ పై మన దేవుళ్ళను ముద్రించి చెలామణి లో ఉంచారు. ఇది 100కోట్ల మంది హిందువుల డిమాండ్. అయోధ్య లో రామమందిర నిర్మాణం పూర్తవుతుంది. 22న రాముని ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. కొంతమంది రాముడి గుడి కట్టలేరు, తేదీ కూడా చెప్పలేరు అన్నారు. దేశం లో వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములు రిలీజ్ చేయాలి. దేశ విభజన సమయంలో మనదేశ ప్రజలను హత్య చేసిన వారి ఆస్తులు కాపాడేందుకు నెహ్రూ వక్ఫ్ చట్టం తెచ్చాడని అన్నారు.
ఒక్క మహారాష్ట్ర లోనే పది లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పేరుతో ఉంది. 2009 వరకు 4లక్షల ఎకరాలు మాత్రమే ఉండేది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను రిలీజ్ చేయాలి. నలుగురు కలిసి ఎవరి భూమి పైన అయినా పిటిషన్ వేస్తే ఆ భూమిని ఎవరూ కాపాడలేరని అన్నారు.