శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు ఆహారం, పాలు అందించాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శుక్రవారం ఆయన స్లాట్ సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాగు నీరు, మరుగు దొడ్ల సదుపాయాలు సరిగా ఉన్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. క్యూలో దర్శనానికి వెళుతున్న భక్తులతో మాట్లాడారు. క్యూ లైన్ల నిర్వహణ పరిశీలించారు. సర్వదర్శనం ఎంత సమయంలో అవుతోందని అధికారులను అడిగారు. ఉదయం అయితే గంటన్నర లోపు, సాయంత్రం 6 గంటల తరువాత వారికి రెండు గంటల్లో అవుతోందని అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజిఓ బాలిరెడ్డిని చైర్మన్ ఆదేశించారు.
Related Articles
కరోనా నుంచి ఇంకా బయటపడలేదు: డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email కరోనా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. కరోనా ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, ఆ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడలేదు అని స్పష్టం చేసింది. గత వారం ప్రపంచ వ్యాప్తంగా 31 లక్షల మందికి కరోనా సోకగా, 54 వేల మంది […]
సెంచరీ కోట్టిన ఆనియన్
ఉల్లిగడ్డ… ఎర్రగడ్డ.. ఆనియన్… పేరులో ఏముంది… ధర చూస్త…
నేడు కేంద్ర మంత్రివర్గంతో ప్రధాని సమావేశం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత నేడు మధ్యాహ్నం 3.45 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం కానుంది. రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. జూలై 7న కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ అనంతరం కేంద్ర మంత్రివర్గంతో మోదీ సమావేశం కానుండటం ఇది నాలుగోసారి. […]