అంతర్జాతీయం ముఖ్యాంశాలు

క‌రోనా నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు: డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌

క‌రోనా మ‌హ‌మ్మారిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చ‌రిక జారీ చేసింది. క‌రోనా ముగిసిపోయింద‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని, ఆ మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌పంచం బ‌య‌ట‌ప‌డ‌లేదు అని స్ప‌ష్టం చేసింది. గ‌త వారం ప్ర‌పంచ వ్యాప్తంగా 31 ల‌క్ష‌ల మందికి క‌రోనా సోక‌గా, 54 వేల మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది.

కొన్ని దేశాల్లో ఆస్ప‌త్రులు నిండిపోతున్నాయి. కొంద‌రేమో విచ్చ‌ల‌విడిగా తిరిగేస్తున్నారు. ఈ రెండేళ్ల‌లో క‌రోనా కాటుకు 50 ల‌క్ష‌ల మంది బ‌ల‌య్యారు అని పేర్కొంది. టీకా తీసుకోని వారే ఎక్కువ‌గా మృత్యువాత ప‌డుతున్నారు. క‌రోనా విష‌యంలో అజాగ్ర‌త్త ఏ మాత్రం మంచిది కాదు అని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది.