జాతీయం ముఖ్యాంశాలు

జూన్ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

43 రోజులపాటు భక్తులకు మంచులింగాన్ని దర్శించుకునే అవకాశం

అమర్‌నాథ్‌ ఆలయానికి యాత్రను జూన్‌ నుంచి 30 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన ఆలయ బోర్డు సమావేశం ఆదివారం జరిగింది. యాత్రకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను జూన్‌ 30న ప్రారంభించి, రక్షాబంధన్‌ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయించారు. ఈ ఏడాదిలో దాదాపు 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఇవ్వనున్నారు. కొవిడ్‌ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు.