రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 129 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2021, జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే, వ్యాక్సిన్‌ల కొరత కారణంగా మొదట్లో నత్త నడకన వ్యాక్సినేషన్ కొనసాగింది. క్రమంగా టీకాల ఉత్పత్తి కూడా పెరుగడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఊపందుకుంది. 2021, జూన్ 21న నేషన్ వైడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో న్యూ ఫేజ్ ప్రారంభమైంది.
2020లో కరోనా మహమ్మారి విజృంభించింది. దాంతో ప్రపంచ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరయ్యాయి. భారత్‌లో 2020 మార్చిలో కరోనా విస్తృతి మొదలైంది. ఆ తర్వాత అంతకంతకే పెరిగిపోయింది. కానీ, ఆ వైరస్‌కు విరుగుడు లేకపోవడంతో లాక్‌డౌన్‌లు గత్యంతరం అయ్యాయి. అన్ని రకాల వ్యాపార, వాణిజ్య, విద్యా కార్యకలాపాలు మూతపడ్డాయి. చివరికి ఈ ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సినేషన్ మొదలయ్యాక కరోనా ప్రభావం క్రమంగా తగ్గిపోయింది.