తెలంగాణ

రైతుబంధు పైస‌లొచ్చె.. రైత‌న్న మురిసె

ఎంత క‌ష్టంలో సీఎం కేసీఆర్ మాట త‌ప్ప‌లేదు !! క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండవంతో న‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ ఇచ్చిన హామీని నెర‌వేర్చారు. నారు పోసే టైంకి రైతుల ఖాతాల్లో రైతుబంధు డ‌బ్బులు జ‌మ చేశారు. స‌మయానికి రైతుబంధు డ‌బ్బులు చేతికి అంద‌డంతో అన్న‌దాత‌లు ఎంతో సంబుర‌ప‌డ్డారు. రైతుబంధు కింద వ‌చ్చిన డ‌బ్బుల‌ను త‌న కూతురికి చూపించుకుంటూ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కోట‌క‌ద్ర మండ‌లంలో ఓ రైతు ఇలా ఆనంద‌ప‌డ్డాడు.