తెలంగాణ ముఖ్యాంశాలు

రేవంత్‌రెడ్డి సహా మరికొందరు నేతల గృహ నిర్బంధం

నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి రేవంత్‌రెడ్డి పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు పోరాటంలో భాగంగా నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించారు. అలాగే, మరికొందరు నాయకులను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.