వైస్సార్సీపీ ని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యమన్న అనిల్ కుమార్ యాదవ్
ఏపీ కేబినెట్ లోని 24 మంది మంత్రులు నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కు వారంతా రాజీనామా లేఖలను అందించారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా పని చేయడం కంటే… జగన్ సైనికుడిగా పని చేయడమే తనకు ఇష్టమని చెప్పారు.
రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని జగన్ ముందే చెప్పారని… అందులో భాగంగానే మంత్రులు అందరూ రాజీనామాలు చేశారని అనిల్ తెలిపారు. మంత్రులందరం చాలా సంతోషంగా రాజీనామాలు చేశామని చెప్పారు. 2024లో వైస్సార్సీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మరి కొందరికి మంత్రులుగా అవకాశం వస్తుందని చెప్పారు. పార్టీ కోసం పని చేసే గొప్ప అవకాశాన్ని జగన్ తమకు ఇస్తున్నారని తెలిపారు.