దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,492
దేశంలో గడిచిన 24 గంటల్లో 4.5 లక్షల మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 1,109 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే 76 కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇదే సమయంలో 43 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఒక్క కేరళలోనే 36 మంది మరణించడం గమనార్హం.
ఇక ప్రస్తుతం దేశంలో 11,492 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉండగా… క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,25,00,002 మంది కరోనా నుంచి కోలుకోగా… 5,21,573 మంది మృతి చెందారు. నిన్న 16.8 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 185 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.