తెలంగాణ ముఖ్యాంశాలు

ఇక ఫై తెలంగాణ పోలీస్ శాఖ చేతికే ఎక్సైజ్, ర‌వాణా నియామ‌కాలు..

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ పోలీస్ శాఖకు సంబదించిన నియామకాలు చేస్తుంటుంది. ఇకపై దీనికి మరో బాధ్యత అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ తో పాటు ఎక్సైజ్, ర‌వాణా శాఖ ఉద్యోగాల భ‌ర్తీని కూడా టీఎస్ఎల్‌పీఆర్‌బీ కి అప్పగించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్నట్టు సమాచారం. టీఎస్ఎల్‌పీఆర్‌బీ ప‌క‌డ్బందీగా ప‌రీక్షల‌ను నిర్వ‌హిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అలాగే పోలీసు, ఎక్సైజ్, ర‌వాణా శాఖల ఉద్యోగాలు ఒకే ర‌క‌మైన యూనిఫాం ఉండంటం తో పాటు ఈ మూడు శాఖ‌ల్లో ఎక్కువ ఉద్యోగాలు కానిస్టేబుల్ సంఖ్య‌నే ఎక్కువ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో పోలీస్, ర‌వాణా, ఎక్సైజ్ శాఖ ల‌ను టీఎస్ఎల్‌పీఆర్‌బీ చేత నియామించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సమాచారం.

రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా మొదటివిడుతగా దాదాపు 30వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. వీటిలో 17,000 పోలీస్‌, 212 రవాణా పోస్టులుండటంతో మండలి ఇప్పటికే ప్రాథమిక కసరత్తు చేపట్టింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడటమే ఆలస్యం నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉంది. తొలుత ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండటంతో ఇందుకోసం ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమైంది.