జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 861 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,058

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య వెయ్యికి దిగువకు చేరుకుంది. గత 24 గంటల్లో 2.7 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 861 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కేవలం ఆరు మరణాలు మాత్రమే సంభవించాయి. గత 24 గంటల్లో 929 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,058గా ఉంది. క్రియాశీల రేటు 0.03 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 4,25,03,383 మంది కోలుకోగా… మొత్తం 5,21,691 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 185 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు. నిన్న ఒక్క రోజే 2.4 లక్షల మంది టీకా వేయించుకున్నారు.