జాతీయం ముఖ్యాంశాలు

భారీగా నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 482 పాయింట్లు కోల్పోయి 58,964కి పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,674కి దిగజారింది. ఐటీ స్టాకుల కారణంగా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.