అంతర్జాతీయం ముఖ్యాంశాలు

న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడి అరెస్ట్

రెండు రోజుల క్రితం న్యూయార్క్ నగరంలోని బ్లూక్లిన్‌లో ఉన్న సబ్‌వేలో ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. గ్యాస్‌ మాస్క్‌ పెట్టుకున్న ఆగంతకుడు.. స్మోక్‌ గ్రెనేడ్‌ విసిరి కాల్పులకు తెగబడ్డాడు. బ్యారేజ్‌లోని 33 బుల్లెట్లు ఖాళీ అయ్యేంత వరకు బ్రూక్‌లైన్‌ సబ్‌వేలోని ప్రయాణికులపై ఫైరింగ్‌ జరిపాడు. దీంతో బ్రూక్లైన్‌ సబ్‌వే మొత్తం రక్తసిక్తమైంది. ఈ ఘటనలో ఆరుగురి ప్రాణాలు పోగా, పలువురు గాయపడ్డారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు.

కాగా ఈ దాడికి పాల్పడిన నిందితుడిని న్యూయార్క్, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ దాడికి పాల్పడింది 62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్‌ గా గుర్తించి అరెస్ట్ చేసారు. నిందితుడి కోసం 24 గంటల పాటు పోలీసులు వేట సాగించగా.. బుధవారం అతడ్ని మాన్‌హట్టన్‌ వీధిలో గుర్తించి..అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేది న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌ కీచంట్‌ సెవెల్‌ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. జేమ్స్‌కు ఓ యూట్యూబ్‌ చానల్‌ ఉండగా.. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వీడియోలు ఉన్నాయంటూ చానల్‌ను మూసివేసింది.