ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(APVVP) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ భర్తీ చేసింది. రెగ్యులర్ ప్రతిపదికన ఈ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 453 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
గైనకాలజీ విభాగంలో 269 ఖాళీలు ఉన్నాయి.
పీడియాట్రిక్స్ – 11
అనెస్తీషియా – 64
జనరల్ మెడిసిన్ – 30
జనరల్ సర్జన్ – 16
ఆర్థోపెడిక్స్ – 12
పాథాలజీ – 05
ఆప్తాల్మాలజీ – 09
రేడియాలజీ – 21
సైకియాట్రీ – 02
డెర్మటాలజీ – 06
ఈఎన్టీ(ENT) – 08