ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఆర్టీసీ చార్జీలఫై ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఏమన్నారంటే ..

డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం తో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు బస్సు చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ చార్జీల మోతతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నప్పటికీ తప్పడం లేదని అంటున్నారు. ఏపీలో అయితే బస్సు చార్జీల పట్ల ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. పెంచిన చార్జీలను తగ్గించాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆర్టీసీ చార్జీల పట్ల కొత్త రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించారు.

రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పినిపే విశ్వరూప్ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భాంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం మంత్రికి ఘన స్వాగతం పలికారు అధికారులు, అర్చకులు. దర్శన అనంతరం మీడియా తో మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ …మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి రావడం బాధాకరం అన్నారు. ఆర్టిసీని కాపాడుకోవడానికే ఛార్జీలు పెంచాల్సి వచ్చింది అని తెలియజేశారు. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి అన్నారు.రెండేళ్ల క్రితమే తెలంగాణ ఆర్టిసీ డీజిల్ పై సెస్ విధించింది అని గుర్తు చేశారు.