ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి..తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. ముందుచూపులేని వైద్యుల బదిలీలతో ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం అయిందని… బదిలీలతో తలెత్తే ఇబ్బందులు అంచనా వేయడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం అయిందని లేఖలో పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వల్ల రోగుల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా అని నిలదీశారు. కరెంటు కోతలతో ప్రభుత్వాసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.
ప్రభుత్వాస్పత్రుల్లో వరుస శిశు మరణాలు, టార్చ్లైట్ల వెలుతురులో ప్రసవాలు జరపాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో బదిలీలు సమంజసమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య రంగం బలోపేతంపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం అని… ప్రజల ప్రాణాలంటే వైసీపీ ప్రభుత్వానికి లెక్కలేనితనం అని లేఖలో పేర్కొన్నారు.