దేశంలో రోజువారీ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆదివారం 1150 కేసులు నమోదవగా, నలుగురు మాత్రమే మరణించారు. అయితే తాజాగా 2183 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణకాగా, 214 మంది మృతిచెందారు. నిన్నటి కంటే ఇవి 90 శాతం కేసులు అధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,44,280కి చేరింది. ఇందులో 4,25,10,773 మంది కోలుకోగా, 5,21,965 మంది మృతిచెందారు. మరో 11,542 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1985 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉన్నదని, 1.21 శాతం మంది మరణించారని వెల్లడించింది. ఇక ఇప్పటివరకు 1,86,54,94,355 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఆదివారం 2,66,459 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలిపింది.