ఆంధ్రప్రదేశ్

ముస్లింలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త

ముస్లింలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. ఈ నెల 26న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేడియాన్ని మంత్రి అంజాద్ బాషా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అధికారులు పరిశీలించారు.

ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు ముస్లింలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు డెప్యూటీ సీఎం అంజాద్ బాషా. ఐదు వేల మంది ఇఫ్తార్ విందుకు హాజరవుతారని అంచనా వేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తరహాలో పండుగలకు తోఫాలు ఇచ్చి సరిపెట్టం.. భారీగా సంక్షేమం అమలు చేస్తున్నాం… తోఫాల పేరుతో అవినీతి చేసే పద్దతి మాది కాదని వెల్లడించారు అంజాద్ బాషా.