మహబూబాబాద్ లోని పత్తిపాకలో దారుణ హత్య చోటుచేసుకుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ 8 వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి దారుణ హత్య కు గురయ్యాడు. బానోత్ రవిని గొడ్డలితో.. నరికి చంపారు దుండగలు.. బైక్ ఫై వెళ్తుండగా..వెనుకనుండి వచ్చి గొడ్డలితో నరికారు.
ఈ నేపథ్యంలోనే స్థానికులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆస్పత్రికి తరలించే లోపే రవి.. మరణించాడు. కాగా.. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బానోత్ రవి.. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈహత్య కు వ్యాపార గొడవలే కారణమైనట్లు తెలుస్తుంది.