అంతర్జాతీయం ముఖ్యాంశాలు

అమెరికాలో కాల్పులు .. ముగ్గురికి తీవ్ర గాయాలు

అమెరికాలో కాల్పుల మోతతో దద్దల్లింది. వాషింగ్టన్‌లోని పోష్‌ ప్రాంతంలో కనెక్టికట్‌ అవెన్యూలో ఓ ముష్కరుడు తుపాకితో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వారు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. బాధితుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉన్నదని చెప్పారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆ ప్రాంతంలోని భవనాలపై ఇంటింటికీ సోదాలు నిర్వహించగా, సంఘటన స్థలంలోని అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం రాత్రి అనుమానాస్పద సాయుధుడు చనిపోయాడు.