జాతీయం ముఖ్యాంశాలు

జార్ఖండ్ లోని కుంతి జిల్లాలో దారుణం : 11 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్ల అత్యాచారం

కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు విధించిన , ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కామాంధులు మారడం లేదు. శిక్షలకు , చట్టాలకు ఏమాత్రం భయపడడం లేదు. ఒంటరిగా మహిళా కనిపించిన , అభం శుభం తెలియని చిన్నారి కనిపించిన సరే కామంతో కాటేస్తున్నారు. తాజాగా జార్ఖండ్ లోని కుంతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు అత్యాచారానికి తెగబడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక పక్క గ్రామంలో జరిగిన వివాహానికి వెళ్ళింది. అక్కడ జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం సందర్భంగా తనకు ఇంతకు ముందే తెలిసిన నిందితులతో వాగ్వాదం జరిగింది. వివాహం అనంతరం బాలిక మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి అర్ధరాత్రివేళ స్వగ్రామానికి ప్రయాణమైంది. వారి వెనుక వస్తున్న బాలలు ఆమెను అడ్డగించారు. అనంతరం ఆ అమ్మాయిని తీసుకొని నిర్మానుష్యమైన స్థలంలో లైంగిక దాడి చేశారు. ఏకంగా ఆరుగురు మైనర్లు బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని… నిందితులను కరెక్షన్ సెంటర్ కు తరలించారు.