ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ తెరాస పార్టీ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో తెరాస పార్టీ 30 సీట్లే సాదిస్తుందని తెలిపారు. మీడియా తో మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రశాంత్ కిషోర్ తనకు చెప్పినట్లు వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సేవలందించలేక చల్లగా పీకే జారుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. 2008లో కెసిఆర్ తనను కలిశారని ..తన మద్దతు కోరగా తాను దేశ జాలు లేకుండా అందించామని పాల్ తెలిపారు. తెలంగాణ లో తెరాస అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని , 8 ఏళ్ల పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. రాష్ట్రం నెత్తి మీద నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి , తెలంగాణకు దళితుడే తొలి సీఎం అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
బిజెపి తనకు ఉప ప్రధాని పదవి ఇస్తానని పేర్కొందని… కానీ తానే వద్దని చెప్పానని కే ఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్ల రూపాయలు చార్జీల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంచిపెట్టారు అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో గ్రామగ్రామాన పర్యటిస్తానని వెల్లడించారు. తన గురించి తాను చెప్పుకోవడానికి ఏమాత్రం మొహమాట పడని కేపాల్ ప్రపంచంలో తన లాంటి వ్యక్తి ఏ ఒక్కరు కూడా లేరని తెలిపారు.